అసెంబ్లీలో దాడి ప్రభుత్వ డ్రామా..!

SMTV Desk 2018-03-13 13:52:21  PCC PRESIDENT, UTTAMKUMAR REDDY, ASSEMBLY MEETING, CONGRESS.

హైదరాబాద్, మార్చి 13 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చైర్మన్ స్వామిగౌడ్‌పై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి దాడి చేశారని వస్తున్న ప్రచారం అవాస్తవం అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. శాసనసభలో స్పీకర్ తమ వాదనలు వినకుండానే సస్పెన్షన్ వేటు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ప్రతిపక్షాన్ని అసెంబ్లీ నుండి గెంటేశారని ఆరోపిస్తూ.. గతంలో హరీష్ రావు శాసనసభలో ప్రవర్తించిన తీరు మరచిపొవద్దని దుయ్యబట్టారు. గడిచిన నాలుగేళ్లలో ఎమ్మెల్యేల అనర్హతపై ఒక నిర్ణయానికి రాని స్పీకర్.. ప్రతిపక్షం అయిన మాపై ఇలా క్షణాల్లో నిర్ణయానికి రావడం విమర్శనాస్త్రాలు సంధించారు.