ఆదుకోవాల్సి౦ది పోయి.. మాయ మాటలు చెప్తోంది..

SMTV Desk 2018-03-12 17:40:38  chandrababu, parliament, central govt,

అమరావతి, మార్చి 12 : విభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన కేంద్రం.. మాయ మాటలు చెప్పి తప్పించుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆనాడు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన కేంద్రం.. ఈనాడు హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి పోలీసు అకాడమీ, సీసీఎంబీ వంటి సంస్థలు ఎందుకు ఇవ్వరు.? భారతదేశంలో ఏపీ ఒక భూభాగం కాదా.? విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం కాని తాము వ్యక్తిగతంగా ఏమీ కోరడం లేదని కేంద్రాన్ని నిలదీశారు.