"చందమామ" సింధుపై కేసు నమోదు..

SMTV Desk 2018-03-11 16:24:26  sindhu menon, cheating case, bank of baroda, fake documents.

బెంగళూరు, మార్చి 11 : "చందమామ" సినిమాలో చలాకీగా చిందులేసి అందరి హృదయాలను దోచుకున్న హీరోయిన్ సింధు మీనన్‌ పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ ధృవపత్రాలను సమర్పించి తమ వద్ద రుణం తీసుకోవడమే కాకుండా తిరిగి చెల్లించడం లేదంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు బెంగళూరులోని ఆర్ఎంసి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు సింధును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ఆమె విదేశాల్లో ఉందని తేలింది. దీంతో పోలీసులు ప్రస్తుతం సింధు సోదరుడు కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జ్యుబిలెంట్‌ మోటార్స్‌ వక్ఫ్‌ ప్రై.లి. సంస్థ పేరుతో సింధు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ నుంచి 36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె సమర్పించిన పత్రాలన్ని తప్పు అని తేలడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.