ఏప్రిల్ 1@ఈ-వే బిల్లు..

SMTV Desk 2018-03-10 17:03:20  e way bill, april 1, finacial minister, arun jaitly.

న్యూఢిల్లీ, మార్చి 10 : జీఎస్‌టీ ఎగవేతను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-వే(ఎలక్ట్రానిక్‌-వే) బిల్లు.. ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమలులోకి రానుందని ఆర్ధిక శాఖా పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన 26 వ జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి దశల వారీగా రాష్ట్రాల మధ్య ఈ-వే బిల్లు ఉంటుందని.. జూన్‌ 1 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని తెలిపింది. జీఎస్‌టీ రిటర్న్‌ల సరళీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సరళీకరణ ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు రావడంతో మరోసారి ఈ అంశాన్ని వాయిదా వేశారు. దీంతో మరో మూడు నెలల పాటు జీఎస్‌టీఆర్‌ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. తక్కువ ఆదాయాన్ని చూపి.. పన్ను ఎగవేత వంటి వాటిని ఈ ప్రక్రియ ద్వారా అరికట్టవచ్చు. రెండు రాష్ట్రాల మధ్య రూ.50వేలకు మించి విలువ గల సరకులు రవాణా చేయాలంటే ఈ-వే బిల్లు ఉండాలి. దీని ఆధారంగా సరకు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతుందో ప్రభుత్వానికి ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.