కోహ్లీ సవాల్.. శిఖర్ చిందులు...!

SMTV Desk 2018-03-10 16:41:24  captain kohli, criketer shikhar dhavan, challenge, dance, twitter.

ముంబై, మార్చి 10 : భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ.. ప్రముఖ బ్యాగ్‌ల తయారీ సంస్థ(అమెరికన్ టూరిస్ట్) కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను అలరించే కోహ్లీ తాజాగా.. ఓ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని స్టెప్పులేశాడు. తనలాగే బ్యాగ్‌ తగిలించుకుని స్టెప్పులేయాలని శిఖర్‌ ధావన్‌కు ఛాలెంజ్‌ విసిరాడు. "శిఖర్.. నా కంటే మెరుగ్గా నువ్వు స్టెప్పులు వేయగలవేమో? ప్రయత్నించు" అంటూ తాను స్టెప్పులేసిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు కోహ్లీ. సవాల్ ను స్వీకరించిన శిఖర్‌.. తాను కూడా బ్యాగ్‌ తగిలించుకుని మీసం మెలేస్తూ తొడకొట్టి స్టెప్పులేసిన వీడియోను పోస్ట్ చేశాడు. అనంతరం ఈ ఛాలెంజ్ ను దిల్‌జిత్‌ దోసంజ్‌ స్వీకరించాల్సిందిగా కోరాడు.