సింధు, శ్రీకాంత్ లకు జక్కన్న విషెస్..

SMTV Desk 2018-03-09 15:31:51  p.v. sindhu, kidimbi srikanth, ss rajamouli wishes.

హైదరాబాద్, మార్చి 9 : ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ లను కలిసి వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ సిరీస్ నిమిత్తం సింధు, శ్రీకాంత్ లు వెళ్లనున్న నేపథ్యంలో వారిని కలిసినట్లు పేర్కొన్నారు. ఆటలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని కోరుకుంటూ "ఆల్ ది బెస్ట్" తెలిపారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫోటోను రాజమౌళి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం జక్కన్న రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ లతో ఒక మల్టీస్టారర్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.