గూగుల్ కు 17,000 కోట్ల జరిమానా

SMTV Desk 2017-06-28 12:15:59  Google Search engine, Europian commission competition, Apple Company, I Phones

బ్రస్సెల్స్, జూన్ 28 : సాధారణంగా మనకు ఏదైనా సమాచారం తెలియని పక్షంలో దానిని తెలుసుకోవడానికి ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ ను వాడతాం. ప్రస్తుతం ఆ గూగూల్ కు ఒక సమస్య వచ్చింది. అది ఏమిటంటే గూగుల్ పెత్తందారీ విధానాలు అనుసరిస్తున్నందులకు ఐరోపా యూనియన్, 2.4 మిలియన్ యూరోల (2.7 బిలియన్ డాలర్లు - అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ. 17,000 కోట్ల) జరిమానా విధించింది. ప్రపంచవ్యాప్త సెర్చ్ ఇంజిన్ విపణిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న గూగుల్, తన షాపింగ్ సేవలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇతర సేవలను విస్మరించిందని యూరోపియన్ కమిషన్ కాంపిటీషన్ చీఫ్ మెగ్‌థే వెసగర్‌ తెలిపారు. ఐరోపా యూనియన్ నియంతృత్వ నిబంధనల ప్రకారం గూగుల్ చర్యలు న్యాయపరంగా ఉండడం లేదని అన్నారు. కొత్తదనం, గొప్ప లక్షణాలు కల్గి ఉన్న ఇతర కంపెనీలు పోటీ పడకుండా గూగుల్ అడ్డుపడుతుందని ఆయన విమర్శించారు. ఐరోపా వినియోగదారులు వినూత్నకు తగిన సేవలను ఎంచుకున్నప్పటికీ పూర్తిస్థాయి ప్రోత్సాహకాలు అందుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తున్నందున వారి ఆందోళనలకు అనుగుణంగా గత సంవత్సర గూగుల్ ఆదాయంలో 10 శాతం లేదా 8 బిలియన్ యూరోల (సుమారు రూ. 58,000 కోట్లు) జరిమానా విధించే ఆస్కారం ఉన్నట్లు మెగ్‌థే వివరించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తామని గూగుల్ తెలిపినట్లు సమాచారం. గతంలో ఐ ఫోన్లను తయారీ చేసే ఆపిల్ కంపెనీకి కూడా వెసగర్ ఇచ్చిన తీర్పు ఆధారంగా ఐర్లాండ్ కు 13 బిలియన్ యూరోలు( 93,600) కోట్లను పన్ను రూపంలో చెల్లించారు.