చరణ్, ఎన్టీఆర్‌ల ప్రయాణం..!

SMTV Desk 2018-03-07 15:48:55  ram charan, junior NTR, rajeev ghandhi international airport

హైదరాబాద్, మార్చి 7 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ లు ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాలో వీరిద్దరు కలిసి కథానాయకులుగా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాని ఈ విషయంపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఈ సినిమా పనుల్లో భాగంగా చరణ్‌, తారక్‌ అమెరికాకు బయలుదేరారని, అందుకే రాజీవ్‌ గాంధీ ఎయిర్ పోర్ట్ లో కనిపించారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చరణ్‌ “రంగస్థలం” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నారు. తారక్‌ “జైలవకుశ” తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నారు.