వ్యవసాయానికి ‘ప్రత్యేకం’ విరమణ

SMTV Desk 2018-03-06 18:06:20  agriculture special budget, CM KCR, telangana government

హైదరాబాద్, మార్చి 6 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం నుండే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. వ్యవసాయదారుల కోసం మరిన్ని కార్యక్రమాలు, పథకాల కోసం నిధులు కేటాయిస్తున్నందున ఈ సారి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. అయితే ఇప్పుడు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు తిరస్కరిస్తాయని ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షలో అధికారులు వివరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే శాఖ బడ్జెట్ ను ప్రధాన బడ్జెట్ లోనే ప్రవేశ పెడుతుందని గుర్తుచేశారు.