ప్రియుడితో నయన్ చెట్టాపట్టాల్..!

SMTV Desk 2018-03-06 16:56:37  nayanatara, director vignesh shivan, photos in social media,

చెన్నై, మార్చి 6 : అగ్ర కథానాయిక నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికా విహారయాత్ర పూర్తి చేసుకుని అక్కడ పలు లొకేషన్ లలో దిగిన ఫోటోలను విఘ్నేష్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. అయితే వీరి రిలేష‌న్‌పై అభిమానుల నుండి, మీడియా నుండి ప‌లు కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ నయన్ ఏ మాత్రం స్పందించడం లేదు. విఘ్నేశ్‌ మాత్రం నయనతార తనకు ఎంత ప్రత్యేకమో తెలుపుతూ పలు సందర్భాల్లో ట్వీట్లు చేశారు. "ఆమె నా జీవితాన్ని ప్రత్యేకంగా మార్చేశారు" అని ఒకానొక సందర్భంలో ట్వీట్ చేశాడు. కాగా న‌య‌న‌తార తమిళంలో "ఇమైకా నొడిగల్‌",‘కొలైయుదిర్‌ కాలం’చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో "సైరా" మూవీ చేయ‌నుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.