ఎంజీఆర్, తలైవాల ప్లెక్సీ వివాదం..

SMTV Desk 2018-03-05 17:06:52  mgr, rajinikanth, poster issue in chennai.

చెన్నై, మార్చి 5 : చెన్నై నగరంలో ఎంజీఆర్, రజినీకాంత్ ల ప్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్.. అటు తమిళ సినిమాలతో పాటు ఇటు రాజకీయాలను కూడా శాసించిన నాయకుడు. అయితే.. ఎంజీఆర్ విగ్రహాన్ని రజనీకాంత్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో వారిద్దరితో కూడిన భారీ ప్లెక్సీలను, హోర్డింగ్‌లను అభిమానులు పలుచోట్ల ఏర్పాటు చేశారు. కాని మద్రాసు హైకోర్టు భారీ ప్లెక్సీల ఏర్పాటు వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని ఇదివరకే ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంజీఆర్-రజనీ పోస్టర్లు స్థానికంగా వివాదాస్పదంగా మారాయి.