అట్టహాసంగా "ఆస్కార్" వేడుక..

SMTV Desk 2018-03-05 11:48:01  askar awards, host jimmi kimmel, loss angels.

లాస్‌ఏంజెల్స్‌, మార్చి 5 : 90వ "ఆస్కార్ అవార్డు"ల ప్రధానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ అవార్డుల కార్యక్రమం సరదాగా సాగిపోవడానికి జిమ్మీ.. అందరిపై పలు ఛలోక్తులు విసురుతున్నారు. ఆస్కార్ గెలుచుకున్న సెలబ్రిటీస్ లో ఎవరైతే తక్కువగా ప్రసంగిస్తారో వారికి జెట్ స్కై అవార్డు ప్రకటిస్తానని జిమ్మీ చమత్కరించడం విశేషం. వివిధ దేశాల నుండి పలువురు నటీనటులు ఈ ఆస్కార్ వేడుకలకు హాజరై రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.