శ్రీదేవి బయోపిక్ పై వర్మ స్పందన

SMTV Desk 2018-03-03 14:48:07  sridevi actress, ramgopal varma director, sridevi biopic,

హైదరాబాద్, మార్చి 3 : సిల్వర్ స్క్రీన్ చాందినీ శ్రీదేవికి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పెద్ద వీరాభిమాని. ఆమెతో సినిమా చేయడానికే దర్శకుడినయ్యానని నిర్మొహమాటంగా చెప్పారు. ఇటివలే తన మేనల్లుడి వివాహానికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి కన్నుమూసిన విషయం తెలిసిందే. దానికి ట్విట్టర్ లో స్పందించిన వర్మ తీరును బట్టి ఆమెను ఎంతలా ఆరాధించాడో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వర్మ శ్రీదేవి బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాలలో హాల్ చల్ చేస్తున్నాయి. దానికి స్పందించిన వర్మ నేను శ్రీదేవి బయోపిక్ ను తీయడం లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే శ్రీదేవి కథను సినిమా తీయాలంటే ఆమె అంతటి నటి ఎవ్వరు లేరని స్పష్టం చేశారు.