తెరాస పొత్తుతోనే కార్యకర్తలకు మనోధైర్యం : మోత్కుపల్లి

SMTV Desk 2018-03-02 15:18:53  tdp leader mothkupalli narsimhulu, coments on trs party, chandrababu.

హైదరాబాద్, మార్చి 2 : తెరాసతో పొత్తు పెట్టుకుంటే కార్యకర్తలకు మనోధైర్యం వస్తుందని టీడీపీ పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. నాడు ఎన్టీఆర్‌ ఆశీర్వాదం పొందిన నేతలు నేడు తెరాసలో ఉన్నారన్నారు. "ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ చాలా ఇబ్బందుల్లో ఉంది. చంద్రబాబు కాస్తంత సమయం కేటాయించి రాష్ట్రంలో పర్యటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మాటలు నేను చంద్రబాబు తెలంగాణలో తిరగట్లేదు అనే కారణంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నా. చంద్రబాబు కాస్తంత తన దృష్టిని పార్టీపై పెడితే తిరిగి పార్టీ పునర్వైభవం సాధించవచ్చు" అన్నారు.