మళ్ళీ షాక్ ఇచ్చిన బ్యాంకులు

SMTV Desk 2017-06-26 14:28:28  lockers,Money, RBI,Information Act, CCI

న్యూఢిల్లీ, జూన్ 26 : మనం సాధారణంగా విలువైన వస్తువులను నగలు, డబ్బులను ఇళ్ళలో దాచుకోవడానికి అంగీకరించం. ఎందుకంటే ఒక వేళ మనం అలా ఉంచుకుంటే మన ధనం, నగలు అంత సురక్షితంగా ఉండలేవని భావించి వాటిని బ్యాంకులోని లాకర్ లో ఉంచితే అక్కడ భద్రంగా ఉంటుందనే ధైర్యంతో పెట్టడం జరుగుతుంది. కాని తాజాగా బ్యాంకులు లాకర్లలో ఉండే వస్తువులకు బాధ్యత వహించే పరిస్థితి లేదని భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఇలాంటి బ్యాంకుల జాబితాలో 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని సమాచారం. సమాచార హక్కు చట్టం కింద కుష్‌ కాల్రా అనే న్యాయవాది దీనిపై లేఖ రాయగా లాకర్ పొందే సమయంలో ఒప్పంద పత్రాలపై అందులోని వస్తువులు చోరీకి గురైతే బ్యాంకుల బాధ్యత కాదని వినియోగదారులతో సంతకం చేయిస్తామనే చేదు నిజాన్ని బ్యాంకులు వెల్లడించడమే కాకుండా లాకర్ ను అద్దెకు ఇచ్చిన సంస్థగా మాత్రమే వ్యవహరిస్తామని తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన న్యాయవాది వినియోగదారులకు మెరుగైన సేవలు దక్కకుండా కొన్ని బ్యాంకులు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. వినియోగదారులకు కలిగే నష్టానికి సంబంధించి బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేయలేదని ఆర్‌బీఐ పేర్కొన్నట్లుగా భారత కాంపీటీషన్ కమిషన్(సీసీఐ)కి ఆయన తెలిపారు. దీనిపై చట్టప్రకారం విచారణ జరిపించాలని సీసీఐని కోరారు.