చివరి మజిలీకీ యూజ్ అవుతుందనుకోలేదు : వర్మ

SMTV Desk 2018-02-28 13:00:07  DIRECTOR RAM GOPAL VARMA, TWEETS ON SRIDEVI, NAGARJUNA COMMENTS.

హైదరాబాద్, ఫిబ్రవరి 28 : శ్రీదేవి అకాల మరణవార్త విని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తట్టుకోలేక తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్ లు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంతో భావోద్వేగంతో శ్రీదేవితో తనకున్న అభిమానాన్ని పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున వర్మను ఓదార్పు చేసే ప్రయత్నం చేశారు. ఈ మేరకు వర్మకు నాగార్జున ట్వీట్ చేస్తూ.. "అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని" అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగని వర్మ.. "గోవిందా గోవిందాలోని అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో సాంగ్ లిరిక్స్ ఆమె కోసమే ఉద్దేశించబడ్డాయి. శ్రీదేవిని సృష్టించినందుకు దేవుడిని ప్రశంసిస్తూ నాగార్జున పాడే పాట ఆమె అంత్యక్రియలకు కూడా ఉపయోగపడుతుందని అసలు ఊహించలేదు" అంటూ ట్వీట్ చేశారు.