నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభ౦..

SMTV Desk 2018-02-28 11:30:51  INTER EXAMS STARTED, HYDERABAD, MORNING 9 TO 12.

హైదరాబాద్, ఫిబ్రవరి 28 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. నేడు ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష..(తెలుగు, సంస్కృతం, ఉర్దూ) పరీక్ష జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు నిబంధనలను మరింత పక్కాగా అమలు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభ౦ కాగా నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించడం లేదు. రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష జరుగుతుంది. కాగా ప్రభుత్వం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 2న ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించి౦ది. అయినప్పటికీ ఆరోజు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష యథాతథంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.