భరత్ అంత్యక్రియలకు రూ. 1500 రెమ్యునరేషన్

SMTV Desk 2017-06-26 13:10:58  raviteja, brother, bharth, daeth,

హైదరాబాద్, జూన్ 26 : సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా అంత్యక్రియలను రవితేజ చిన్న తమ్ముడు రఘు దగ్గరుండి ఈ అంత్యక్రియలను మహాప్రస్థానంలో జరిపించారు. ఈ అంత్యక్రియలకు రవితేజ కుటుంబ సభ్యులు కనీసం చివరి చూపు కూడా చూడలేదు. భరత్ కు తల కొరివి పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. అందరు ఉన్న ఎవరు స్థితిలో భరత్ కు ఒక జూనియర్ ఆర్టిస్టు చేత తల కొరివి పెంటించారు. ఈ తల కొరివి పెట్టడానికి జూనియర్ ఆర్టిస్టు రూ. 1500 తీసుకున్నాడు. ఈ పనికి జూనియర్ ఆర్టిస్టు తన పిల్లల స్కూల్ ఫీజ్ కట్టడానికి ఒప్పుకున్నని చెప్పాడు. ఈ అంత్యక్రియలకు సినీ నటులు అలీ, ఉత్తేజ్, ఆర్యన్ రాజేష్ తో పాటు మరికొంత మంది సన్నిహితుల మద్య అంత్యక్రియలు ముగిశాయి.