రాజ్యసభలో బలంగా మారనున్న కమలదళం..

SMTV Desk 2018-02-26 11:29:29  bjp, congress, rajyasabha elections, trs, ysrcp

న్యూఢిల్లీ, జనవరి 26 : పెద్దల సభ (రాజ్యసభ) లో బీజేపీ స్థానాలు పెరగనున్నాయి. వచ్చే నెల 23న 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని కాషాయిదళం ధీమావ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా లోక్ సభలో అత్యధిక మెజారిటీ ఉన్నఎన్డీఏ ఎగువ సభలో కీలక బిల్లుల ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం 58 సీట్లతో రాజ్యసభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య పార్టీలతో పాటు కేంద్రానికి అనుకూలంగా ఉన్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్, బీజేడీ, వైఎస్సార్‌సీపీల మద్దతును కలుపుకుంటే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకు ఎదురులేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.