శ్రీదేవి మృతిపై స్పందించిన వర్మ..

SMTV Desk 2018-02-25 11:39:44  sridevi died, ramgopal varma, twitter, hyderaabad.

హైదరాబాద్, ఫిబ్రవరి 25 : అలనాటి మేటి నటి శ్రీదేవి మృతి చెందడం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతి పట్ల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి తన ఆరాధ్య దేవత అంటూ ఇదివరకే ఎన్నో వేదికలపై తెలిపిన వర్మ.. ఓ సందర్భంలో తనకు ఎంతో ఇష్టమైన శ్రీదేవిని పెళ్లి చేసుకున్న బోని కపూర్ అంటే తనకు కోపం అంటూ వ్యంగ్యాస్రాలు సైతం సంధించారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిని తట్టుకోలేని రామ్‌గోపాల్‌వర్మ.. ట్విట్టర్ వేదికగా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. "ఈసారి ఆ దేవుడే ఒక జామురాతిరి ఆ జాబిలమ్మకు జోలపాడాడు. తన జాజికోమ్మను భూలోకంలో ఎక్కువకాలం వుంచలేక శాశ్వతంగా తన దరికి చేర్చుకున్నారు. నేను ఈరోజు దేవుడిని ద్వేషించినంతగా ఎన్నడూ ద్వేషించలేదు. ఒక మంచి వెలుగును ఆయన ఆర్పేశాడు. బోనీకపూర్‌కు నా హృదయపూర్వక సంతాపం" అని ట్వీట్‌ చేశారు.