రాహుల్‌ నాయకుడే కాదు : హర్ధిక్‌ పటేల్‌

SMTV Desk 2018-02-24 15:22:09  pass head hardik patel, rahul gandhi, priyanka gandhi, congress

ముంబై, ఫిబ్రవరి 24: పటీదార్‌ ఉద్యమ నేత హర్ధిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో రాహుల్‌ నాయకుడే కాదని, రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఆయన అన్నారు. శుక్రవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన హర్ధిక్‌ మాట్లాడుతూ.. " ఓ వ్యక్తిగా రాహుల్‌ గాంధీ అంటే నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి వినడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదు. అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నా అభిప్రాయం " అని వ్యాఖ్యానించారు. రాబోవు 2019 ఎన్నికల్లో పటీదార్‌ అనమత్‌ ఆందోళన్‌ సమితి(పీఏఏఎస్‌) తరపున పోటీ చేయబోనని హర్ధిక్‌ స్పష్టం చేశాడు.