తమ్ముడి అంత్యక్రియలకు హాజరు కాని రవితేజ

SMTV Desk 2017-06-25 18:27:46  raviteja, brother, bharath, death,

హైదరాబాద్, జూన్ 25 : రంగారెడ్డి జిల్లా కోత్వాల్ గూడ సమీపంలో హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తమ్ముడి అంత్యక్రియలకు రాలేనని రవితేజ అన్నారు. రవితేజ తమ్ముడితో ఉన్న 30 ఏళ్ల అనుభందాన్ని గుర్తుచేసుకొని భావోగ్వేదానికి లోనయ్యారు. ఈ పరిస్థితుల్లో తమ్ముడిని చూసి తట్టుకునే శక్తి నాకు లేదన్నారు. భరత్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎవరు హాజరు కావడం లేదన్నారు. రవితేజ వాళ్ళ అమ్మ కూడా తన కొడుకును ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకునే శక్తి లేదన్నారు. కుటుంబ సభ్యులు అందరు శోకసంద్రంలో ఉన్నారు. అందుకే ఈ అంత్యక్రియలకు రాలేకపోతున్నాం అన్నారు. ఈ విషయాన్నీ మీడియా మిత్రులు అర్ధం చేసుకోవాలని రవితేజ కోరారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుంచి నేరుగా జూబ్లిహిల్స్ మహాప్రస్థానంకు తరలించారు. ఈ అంత్యక్రియలకు రవితేజ చిన్న తమ్ముడు రఘు మాత్రమే దగ్గరుండి చూసుకున్నాడు. సినీ ప్రముఖులు అలీ, ఉత్తేజ్, జీవిత రాజశేఖర్ మరికొంత మంది మాత్రమే హాజరయ్యారు.