బి. ఏ. ఉర్దూ మీడియం పుస్తకాలు విడుదల..

SMTV Desk 2018-02-23 15:55:28  URDHU BOOKS FOR BA STUDENTS, DEPUTY CM, KADIYAM SRIHARI.

హైదరాబాద్, ఫిబ్రవరి 23 : బి.ఏ రెండో సంవత్సరానికి సంబంధించి హిస్టరీ సబ్జెక్టు ఉర్దూ మీడియం పుస్తకాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. గత సంవత్సర౦లో బి.ఏ హిస్టరీ మొదటి సంవత్సరం పుస్తకాలను విడుదల చేసి. నేడు ఈ సంవత్సరానికి సంబంధించి రెండో సంవత్సరం బి.ఏ హిస్టరీ పుస్తకాలను కడియం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ మీడియ౦కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలన్నారు. కాగా ఈ ఉర్దూ పుస్తకాలను నాంపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ సమీనా బషీర్ రాశారు. అనంతరం కడియం సచివాలయంలో పుస్తక రచయితను, ఆయన బృందాన్ని అభినందించారు.