సోఫియాపై ప్రేమను వ్యక్తపరిచిన షారుఖ్...

SMTV Desk 2018-02-23 11:40:02  the robot sofia, sharukh khan, twitter, it congress.

హైదరాబాద్, ఫిబ్రవరి 23 : ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో "సోఫియా" అనే రోబో "మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు" అనే అంశంపై పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప‌లు విష‌యాల‌పై మాట్లాడిన సోఫియాని ఇష్టమైన న‌టుడు ఎవ‌రు అని అడిగితే షారుఖ్ ఖాన్ అని చెప్పింది. ఈ మాటలకు షారూఖ్ త‌న ట్విట్ట‌ర్‌లో బదులిచ్చారు. "నా దేశానికి వ‌చ్చిన మ‌హిళ‌కు నా ప్రేమ‌ను బ‌హిరంగంగా వ్య‌క్త‌ప‌రిచారు. సోఫియా ప్రతి విషయంలో నన్ను అనుకరించావు" అంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. కాగా సోఫియాకు సౌదీ అరేబియా పౌరసత్వాన్ని అందించింది. మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు నాకు ఈ పౌరసత్వం అవసరం అంటూ ఆ దేశానికి సోఫియా కృతజ్ఞతలు తెలిపింది.