అవిశ్వాసమే ఆఖరి అస్త్రం :మంత్రి ప్రత్తిపాటి

SMTV Desk 2018-02-21 17:06:55  prattipati pullarao, bjp, tdp, ysrcp, amaravathi

అమరావతి, ఫిబ్రవరి 21 : రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. విభజన చట్టంలో హామీల ఆమలు కోసం రాష్ట్రప్రభుత్వం, భాగస్వామ్య పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. మరో వైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. కాగా ఈ విషయంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ.. అధికార, మిత్ర పక్షాల మధ్య వైకాపా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు మంజూరు చేయకపోతే ఆఖరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.