కమల్ కొత్త పార్టీకి కౌంట్ డౌన్..

SMTV Desk 2018-02-21 11:11:38  kamalhasan, political entry, party name, chennai.

చెన్నై, ఫిబ్రవరి 21 : విలక్షణ నటుడు కమల్‌హాసన్.. నేడు తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ ఉదయం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్వస్థలం రామేశ్వరం నుండి కమల్‌ రాజకీయ యాత్రను ప్రారంభించారు. కలాం సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం అక్కడి నుండి రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో మదురైలో జరిగే సభలో తన పార్టీ పేరును, జెండా వివరాలను కమల్ ప్రకటించనున్నారు. ఈ ప్రారంభ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.