వయస్సు చిన్నది.. ఆశయం పెద్దది..

SMTV Desk 2018-02-20 13:13:07  navyandra, brand ambassador, vaisnavi, amaravathi.

అమరావతి, ఫిబ్రవరి 20 : చిన్నతనంలోనే పాఠశాలలను దత్తత తీసుకొని తన వంతు సాయంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది పదమూడేళ్ల చిన్నారి వైష్ణవి. అలా అని తానూ ఏ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఓ సాధారణ ఆర్‌ఎంపీ వైద్యుడి కుమార్తె. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి.. తన తండ్రి అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బును పలు సామాజిక సేవలకు వినియోగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తన కృషికి అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ చిన్నారిని నవ్యాంధ్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. చిన్నవయస్సులోనే ఇంతటి ఘనత సాధించిన వైష్ణవికి పలువురు అభినందనలు తెలియజేశారు.