మానవుడు ఒక అద్భుత సృష్టి : రోబో సోఫియా

SMTV Desk 2018-02-20 12:38:50  it congres, robo sofia, interview, hyderaabad.

హైదరాబాద్, ఫిబ్రవరి 20 : ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు రెండవ రోజు ఘన౦గా ప్రారంభమై౦ది. ఈ సదస్సులో భాగంగా "మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు" అనే అంశంపై సోఫియా అనే రోబో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇందులో భాగంగా ప్రపంచంలో తనకు ఇష్టమైన దేశం హాంకాంగ్ అని.. ఎందుకంటే తాను అక్కడే పుట్టానని చెప్పింది. మనుషులతో పోలిస్తే రోబోలకు రూల్స్‌ వేరే ఉంటాయా? అన్న ప్రశ్నకు.. ప్రత్యేక నిబంధనలు అంటూ ఉండవు. కానీ మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు నాకు ఈ పౌరసత్వం అవసరం. పౌరసత్వం ఇచ్చిన సౌదీ అరేబియాకు నా కృతజ్ఞతలు అంటూ తెలిపింది. మానవజాతిని అంతమొందిస్తానని ఒకప్పుడు అన్నాను. అప్పుడు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ సరిగా పనిచేయలేదు. నిజానికి నాకు ఎవరినీ చంపాలని లేదంటూ స్పష్టం చేసింది. రోబోలకు విశ్రాంతి కావాలన్న సోఫియా.. మానవజాతి గురించి మాట్లాడుతూ.. మానవుడు ఒక అద్భుత సృష్టి అని వివరించింది. బాలీవుడ్, హాలీవుడ్ లలో నచ్చిన హీరో షారుఖ్ ఖాన్ అని, తన డేట్ అంతరిక్షంలో అని చాలా తెలివిగా సమాధానాలు చెప్పింది. చివరగా ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటి అని అడుగగా.. అందరిని ప్రేమించండి అంటూ ముగించింది.