నల్గొండ ఎంపీగానే బరిలోకి దిగుతా..

SMTV Desk 2018-02-18 13:56:39  nalonda mp, clp leader komiti reddy, congress, devarakonda

నల్గొండ, ఫిబ్రవరి 18: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిబాబా దేవాలయం అభిషేక పూజలో సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత దేవరకొండ మండలం కమలాపురంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగానే పోటీ చేస్తానని, తన గెలుపుపై హైకమాండ్‌కు నమ్మకం లేకుంటే సర్వే చేసి టిక్కెట్టు ఇస్తుందని తెలిపారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో త్వరలో సీబీఐ ఆర్డర్‌ రానుందని అప్పుడు అందరి పాత్రలు తెలుస్తాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.