సీపీఎస్ లో వర్మపై ముగిసిన విచారణ..

SMTV Desk 2018-02-17 16:03:33  ramgopal varma, cps, intragation, director

హైదరాబాద్, ఫిబ్రవరి 17 : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు సీపీఎస్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటల 20 నిముషాలు విచారణ చేసిన పోలీసులు ఆయన పై 24 ప్రశ్నలను సంధించారు. విచారణ సమయంలో అతని దగ్గరగల చరవాణి, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు సోమవారం విచారణకు రావాలంటూ ఆదేశించారు. సీపీఎస్ నుండి బయటకు వచ్చిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.