జేఏసీతో మాకేమి ఇబ్బంది లేదు : చంద్రబాబు

SMTV Desk 2018-02-15 13:03:13  chandra babu naidu, jac, pawan kalyan, amaravathi

అమరావతి, ఫిబ్రవరి 15 : రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఏసీతో తెలుగుదేశానికి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పవన్ పోరాటంలో అర్థం ఉందన్న చంద్రబాబు.. రాష్ట్రానికి మేలు జరగాలనే కాంక్షతో తనకు తోచిన విధానంలో పవన్ వెళ్తున్నారని తెలిపారు. తెలుగుదేశం ఉద్దేశం కూడా రాష్ట్రానికి మేలు జరగాలనేనని... శ్వేత పత్రాలు అడిగితే సున్నిత పద్ధతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన వెల్లడించారు.