కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీ..

SMTV Desk 2018-02-09 16:30:16  ap badjet issue, secretariat staff, protest, amaravathi

అమరావతి, ఫిబ్రవరి 9 : విభజన హామీల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీరును నిరసిస్తూ అమరావతి సచివాలయం నుండి భారీ ర్యాలీ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని సహించమ౦టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి చాలా సార్లు ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని, ఇది సరికాదంటూ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.