పోరాటాన్ని మరింత ఉదృతం చేయ౦డి : చంద్రబాబు

SMTV Desk 2018-02-09 11:48:48  chandrababu naidu, central govt, budjet issue, teleconference, tdp mps.

అమరావతి, ఫిబ్రవరి 9 : దుబాయ్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఆందోళనలు చేపడుతున్న క్రమంలో కేంద్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నుండి టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నేడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహి౦చి భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. కేంద్రం చాలా అసంతృప్తిని మిగులుస్తుందని వాపోయిన ముఖ్యమంత్రి.. నేడు ఉభయ సభల్లో పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సస్పెండ్ చేసిన వెనకడుగు వేయొద్దని ఆదేశించారు.