ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్..

SMTV Desk 2018-02-08 12:27:41  it congress, nascam team, minister ktr, pm modi.

హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి కేటీఆర్.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై నాస్కాం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. అతిధులకు సాదర స్వాగతం పలకడంతో పాటు మంచి అతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాస్కాం ప్రతినిధులు జరుగుతున్న ఏర్పాట్ల విషయాలను మంత్రికి వివరించారు. కాగా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే శ్రీలంక ప్రధాని సహా పలు దేశాల ప్రముఖులు సదస్సుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.