మొత్తం 53 శాతం పనులు పూర్తయ్యాయి..

SMTV Desk 2018-02-05 15:31:57  irrigation minister, umamaheshwar rao, polavaram project, chandrababu naidu.

అమరావతి, ఫిబ్రవరి 5 : జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్టుపై 50 వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించి రికార్డు సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం పాజెక్టుపై మూడున్నర సంవత్సరాల నుండి చంద్రబాబు శ్రమిస్తున్నామని మంత్రి ఉమా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో పట్టుదలతో నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల స్వప్న౦ సాకారం చేయడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి మంత్రి దేవినేని సహా జలవనరుల శాఖ అధికార యంత్రాంగం అభినందనలు తెలియజేశారు. పోలవరంపై గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా వారవారం సమీక్ష నిర్వహిస్తున్నారని వెల్లడించారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి 53% పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.