నేడు ఎంపీలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్..

SMTV Desk 2018-02-05 11:02:07  ap cm, chandrababu naidu, teleconference, tdp mps, parliament.

అమరావతి, ఫిబ్రవరి 5 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న పార్టీ నేతలు, ఎంపీలు, అధికారులు, ఇతర ముఖ్య నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన చంద్రబాబు.. నేడు పార్టీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు.. సభలో ఎలాంటి అంశాలపై చర్చించాలి, ఎజెండా ఏంటి.? అనే అంశాలపై మరొకసారి దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీ రాష్ట్రానికి మోడీ చేయి చూపించిది. విశాఖ రైల్వే జోన్ సహా ఒక్క హామీ కూడా అమలుకాకపోవడంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని టీడీపీ ఎంపీలు తోట నరసింహం, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు నోటీసు ఇచ్చారు. విభజన హామీల అమలుపై 193వ నిబంధన కింద చర్చ చేపట్టాలని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.