చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..!

SMTV Desk 2018-02-04 14:02:22  chandrababu naidu, tdp party, badjet meetings, parlamentary meetings.

అమరావతి, ఫిబ్రవరి 4 : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ తెదేపా ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల చంద్రబాబు.. కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న విషయం తెలిసిందే.