చెరకు మద్దతు ధర పెంపుతో రైతన్నకు ఊరట

SMTV Desk 2017-05-29 11:21:15  sweet cane,support price,central declared

న్యూ ఢిల్లీ, మే 28 : చెరకు మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రైతన్నలకు ఉరట లభించినట్లయింది. 250 రూపాయలు పెంచి టన్నుకు 2550/- రూపాయల మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి వర్గ ఆమోదం లభించింది. చక్కెర కర్మాగారాల పరిస్థితి మెరుగైన దరిమిలా 10.6 శాతం మద్దతు ధరను పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. అదే విధంగా కొన్ని రాష్ట్రాలు చట్టబద్ద కనీస మద్దతు ధరను అందిస్తున్నాయి. ఆ ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో చట్టబద్ద కనీస మద్దతు ధర అమల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.