విలపించిన వితంతువుల వేదిక

SMTV Desk 2017-06-24 15:50:16  widow, telangana, akkineni amala, speaker, madhusudhana chary, harish rao, minister,

హైదరాబాద్, జూన్ 24 : తెలిసి తెలియని వయస్సు లోనే వివాహమై, ఆ తరువాత 5 సంవత్సరాలకే భర్త మరణించాడు. అత్తింటి వారి అగచాట్లు భరించలేక, పుట్టింటికి వెళ్దామంటే అమ్మ చనిపోయింది. బయట జీవనం కొనసాగిద్దామంటే ఎలా బతుకలో తెలియదు. ఒక వైపు వితంతుల వివక్ష మరో వైపు లైంగిక వేధింపులు, జీవనం శూన్యంగా గోచరించినా పిల్లలపై ప్రేమతో బతుకుబండిని లాగుతున్నారు. మేము దేనీలో తక్కువ కాము, మాపై ఎందుకీ ఈ వివక్ష అంటూ వితంతువుల వేదిక విలపించింది. అంతర్జాతీయ వితంతువుల దినం సందర్భంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో పదివేల మంది వితంతువులతో రాష్ట్ర స్థాయి మహాసభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి హరీష్ రావు, స్పీకర్ మధుసుధనచారి లు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వితంతువులు మాట్లాడుతూ తమను చిన్నచూపు చూడడం మానుకోవాలని. వితంతువులపై ప్రజల ఆలోచనలో మార్పులు రావాలన్నారు. శుభకార్యాలకు పిలవకుండా అంటారని వారిగా చూసే వ్యవస్థకు స్వస్తి చెప్పాలని తమ కష్టాలను వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీరి భాదలు విని స్పందించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...ఇకపై ప్రతి శుభకార్యంలో వితంతువులను భాగస్వాములు చేస్తామని, శంకుస్థాపనల్లో వారితోనే కొబ్బరికాయ కొట్టించి మూఢనమ్మకాలను బద్దలుకొడతామన్నారు. చిన్నవయసులోనే భర్తను కోల్పోయినవారి పరిస్థితి ధీనంగా ఉంటుందని, వారిని అవమానిచినట్లు ప్రవర్తించడం సరి కాదన్నారు. చాలా మంది మహిళలు చిన్నవయసులోనే భర్తను కోల్పోవడానికి ప్రధాన కారణం గుడంబానేనని, గుడంబా రహిత సమాజం కోసం సీఎం పాటు పడుతున్నారన్నారు. గ్రామాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటుకు కృషి చేసి, వితంతువులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పిడియాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం స్పీకర్ మధుసూదనచారి మాట్లాడుతూ... వితంతువుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరిగేలా తోడ్పడుతానన్నారు.