ట్వీట్లతో మార్మోగిన ఐపీఎల్..

SMTV Desk 2018-02-02 12:09:32  ipl-11, twitter, ben stokes, tweets, benguluru

బెంగళూరు, ఫిబ్రవరి 2 : ఐపీఎల్.. ప్రపంచదేశాల ఆటగాళ్లను ఒకటిగా చేసి క్రీడాభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తున్న టోర్నీ. కాగా దశాబ్దకాలం పాటు అలరించిన ఈ మెగా లీగ్ ఇప్పుడు 11వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్ కోసం గత నెల జనవరి 27, 28న బెంగళూరులో వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులు సామాజిక మాధ్యమాల్లో ఐపీఎల్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌పై ఈ రెండు రోజుల్లో చేసిన ట్వీట్లు ఎన్నో తెలుసా.. సుమారు 7,70,000. ఇందులో ఎక్కువగా ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ గురించే నెటిజన్లు మాట్లాడుకున్నారట. తాజాగా ట్విటర్‌ గణాంకాలను ఓ సర్వే సంస్థ వెల్లడించింది. ఇందులో జనవరి 27, 28న ఐపీఎల్‌ గురించే నెటిజన్లు ఎక్కువ ట్వీట్లు చేసినట్లు తెలిపింది. ‘ఐపీఎల్‌ 2018 ఆక్షన్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ పేరిట సుమారు 7,70,000లకు పైగా ట్వీట్లు నమోదు కాగా అందులో 2,30,000 ట్వీట్లు ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌పై నమోదయాయట. ఈ ఏడాది వేలంలో బెన్‌స్టోక్స్‌ ను రాజస్తాన్ రాయల్స్ జట్టు 12.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.