ఉపరాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కానుక..

SMTV Desk 2018-02-01 12:58:29  medaram jathara, vice president, venkaiah naidu, govt goft.

వరంగల్, ఫిబ్రవరి 1 : మేడారం మహా జాతరకు తొలిసారి ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వం అపురూపమైన కానుకను ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. మేడారం జాతర విశిష్టతలకు, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రూపొందించిన కానుకలను వెంకయ్యకు అందజేయనున్నారు. సమ్మక్క- సారలమ్మలకు ప్రతిరూపమైన కుంకుమ భరిణె, అచ్చు వేసిన మేడారం జాతర గద్దెల జ్ఞాపికను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈసారి జాతర విశిష్టతను సంతరించుకోనుంది. కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాలకు చెందిన ముఖ్యులు రానున్న నేపథ్యంలో వారందరికీ రాష్ట్రం ప్రత్యేక బహుమతులను అందించాలని నిర్ణయించారు.