యువతపై భరోసా ఉంది : మోదీ

SMTV Desk 2018-02-01 12:04:15  khelo india school games, pm modi, new delhi, young stars

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : దేశంలో క్రీడాభివృద్ధి కోసం ఉద్దేశించిన తొలి ఖేలో ఇండియా పాఠశాలల క్రీడల్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో క్రీడా ప్రతిభకు లోటు లేదని, మన దేశం క్రీడల్లో మహోన్నత స్థాయికి చేరగలదని అన్నారు. ‘‘శాస్త్ర, కళ, క్రీడా రంగాల్లోనూ మనం బలంగా ఉండాలి. ఈ రంగాల్లోనూ భారత్‌ ఉన్నత స్థాయికి వెళ్తుందని నాకు నమ్మకముంది. యువతపై నాకు భరోసా ఉంది. దేశంలో క్రీడా ప్రతిభకు లోటు లేదు. క్రీడల్లో మనం మరింత ఉన్నతి సాధించగలం. క్రీడలు మానసిక వికాసానికి ఎంతో ముఖ్యం. ఖేలో ఇండియా ఒక కార్యక్రమం కాదు. అదొక ఉద్యమం. ఇవి భారత యువ క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి.. మన దేశ క్రీడా సామర్థ్యాన్ని చాటి చెబుతాయి” అని మోదీ వ్యాఖ్యానించారు.