సంప్రదాయాన్ని కొనసాగించిన జైట్లీ..

SMTV Desk 2018-02-01 11:43:53  budjet 2018-19, arun jaitley, speech, english, parliament

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఎప్పటి నుండో వస్తున్నా సంప్రదాయాన్ని కొనసాగించారు. ఎన్డీఏ ప్రభుత్వంకు చివరి బడ్జెట్ ను ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కాగా ముందు నుండి అతని ప్రసంగం హిందీలో కొనసాగుతుందని వార్తలు వచ్చాయి. కానీ అందరికీ అర్థమయ్యేలా జైట్లీ ఎప్పటి లాగనే, ఆంగ్లంలోనే బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆరభించారు. అటు పూర్తిగా ఆంగ్లంలో కాకుండా.. ఇటు పూర్తిగా హిందీలో కాకుండా రెండు భాషల్లో అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. అంతే కాకుండా సంప్రదాయానికి భిన్నంగా బడ్జెట్‌ను రెండు భాషల్లో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. “జీఎస్టీ అమలు తర్వాత పేదలకు మేలు జరిగింది. అంచనాలకు అనుగుణంగా మొదటి సారి వ్యవసాయ రంగంపై ప్రసంగం ప్రారంభించారు. ప్రపంచంలో ప్రపంచంలో ఏడో ఆర్థికశక్తిగా ఎదిగాం. త్వరలోనే ఐదో ఆర్థిక‌శ‌క్తిగా భార‌త్ అవతరించనుంది. ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించం” అని జైట్లీ పేర్కొన్నారు.