లక్ష్యాలను సాధించడంలో కృషి చేస్తాను : జోషి

SMTV Desk 2018-01-31 17:35:38  cs, sk joshi, telangana government, kcr, hyderabad.

హైదరాబాద్, జనవరి 31 : ప్రభుత్వ౦ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటినన్నింటిని అధిగమించడమే తన కర్తవ్యం అంటూ తెలంగాణ నూతన కార్యదర్శి ఎస్కే జోషీ అన్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎస్‌గా నియమించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్‌తో కష్టపడి పనిచేస్తాను. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడంలో నా వంతు కృషి చేస్తాను. చిన్నప్పుడు హైదరాబాద్ చూడాలన్న కోరిక బలంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇక్కడే సీఎస్ గా పనిచేసే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాను" అని వెల్లడించారు. ఈ సందర్భంగా జోషికి పలువురు అధికారులు అభినందనలు తెలియజేశారు.