రెండవ తేదీ నుండి ఏపీలో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి

SMTV Desk 2018-01-31 11:52:33  Vice President, venkaiah naidu, ap tour.

విజయవాడ, జనవరి 31 : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిబ్రవరి రెండవ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రెండవ తేదీన వెంకయ్య నాయుడు ఢిల్లీ నుండి ఒక ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుండి విజయవాడలోని ఒక నేత్రాలయాన్ని ప్రారంభించి అక్కడ నుండి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు వెళ్లి ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. అలాగే మూడవ రోజు గుంటూరు జిల్లాలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల స్వర్ణోత్సవంలో పాల్గొంటారు. అలాగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి తిరిగి ట్రస్ట్ కు చేరుకుంటారు. నాలుగవ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీ వెళతారు.