కోటి ఎకరాల మాగాణి లక్ష్యంతో ముందుకెళ్తున్నా౦ : మంత్రి హరీష్

SMTV Desk 2018-01-30 15:16:56  nabard state credit seminar, irrigation minister harish rao, minister eetala rajendar.

హైదరాబాద్, జనవరి 30 : హైదరాబాద్ లోని మ్యారీగోల్డ్ హోటల్‌లో "నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్‌"ను భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నాబార్డ్ తెలంగాణ స్టేట్ ఫోకస్ పేపర్‌ను ఆవిష్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ౦ మొదట ప్రాధాన్యం వ్యవసాయ రంగమే అని తెలిపారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని.. "నాబార్డ్" వ్యవసాయం కోసం అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ సెమినార్ లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా సత్పలితాలు సాధిస్తున్నామని, పాడి పంటలకు "నాబార్డు" ప్రోత్సాహం ఇచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.