అమరావతి అంబాసిడర్‌గా 9వ తరగతి విద్యార్థిని..

SMTV Desk 2018-01-30 12:41:35  chandrababu naidu, amaravathi, ap cm,

అమరావతి, జనవరి 30: సెక్రటేరియేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన 14 సంవత్సరాల విద్యార్థిని అంబుల వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. 9వ తరగతి చదువుతున్న వైష్ణవిని, ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అంబాసిడర్‌ గా నియమించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి బాలిక ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అభినందించారు. అంతేకాదు ఆయన, ఈ అంబాసిడర్‌ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన వైష్ణవి, ఇప్పటికే అమరావతి నిర్మాణానికి తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందజేసింది. తాను ఇప్పటివరకూ రూ. 4 లక్షలు ఖర్చు పెట్టి రెండు స్కూళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వైష్ణవి తెలిపింది.