కుంబ్లే స్థానంలో సెహ్వాగ్ రావాలి : అజిత్ వాడేకర్

SMTV Desk 2017-06-23 18:10:08  anil kumble, ajith vedekar, indian

న్యూఢిల్లీ, జూన్ 23 : భారత్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే అందించిన విజయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పదవికి రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ రాజీనామాతో కోచ్ పదవికి ఎవరిని నియమించాలానేది బిసిసిఐ వర్గాలలో సందిగ్దత నెలకొంది. దీనిపై భారత జట్టు మాజీ కోచ్ అజిత్ వాడేకర్ స్పందిస్తూ "ఈ పదవికి నేను అనిల్ కే మద్దతిస్తాను. గత సంవత్సరం భారత్ సాధించిన విజయాలే ఇందుకు కారణం" అన్నారు. "అనిల్ తరవాత కోచ్ గా ఎవరిని ఎంచుకోవాలనే విషయానికొస్తే నేను సెహ్వాగ్ కు సపోర్ట్ చేస్తాను" అని తెలిపారు. "1992- 96 లో నేను కోచ్ గా ఉన్నప్పుడు అనిల్ జట్టులో ఉన్నాడు. భారత్ జట్టు ఇన్ని విజయాలు సాధించడంలో సచిన్, ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్ లతో పాటు అనిల్ కూడా పాటుపడ్డారు. విజయాలు సాధించాలని అనిల్ కుంబ్లే ఎంతటి కష్టమైన భరించే వారు" అన్నారు. "భారత్ జట్టు కోచ్ గా కూడా మంచి విజయాలు అందించాడు. అతను చేసిన రాజీనామా వార్త విని నేను షాక్ అయ్యాను" చెప్పారు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తో కుంబ్లే కోచ్ పదవి కాలం ముగియడంతో వెస్టిండిస్ తో జరిగే మ్యాచ్ లకు అనిల్ కుంబ్లే వెళ్ళలేదు. వెస్టిండిస్ తో భారత్ 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ లను ఆడనుంది.