కేసీఆర్ మేడారం జాతరకు షెడ్యూల్ ఖరారు..

SMTV Desk 2018-01-29 11:04:11  cm kcr, medaram jathara, schedule.

భూపాలపల్లి, జనవరి 29 : కేసీఆర్ మేడారం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 2వ తేదీన తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఈ మహాజాతరకు హాజరుకానున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన రెండవ జాతర. మొదటిసారి జాతరను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన కేసీఆర్ పలు కారణాలతో అప్పుడు రాలేకపోయారు. కాని ఇప్పుడు తప్పకుండా ఈ మహా జాతరకు హాజరవుతారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఆయన ఉద్యమ నేతగా ఉన్నప్పుడు సతీసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.