భల్లే..భల్లే.. గేల్ పంజాబ్ కు వెళ్లే..

SMTV Desk 2018-01-28 20:56:09  chris gayle, kings x1 punjab, ipl-11, benguluru

బెంగుళూరు, జనవరి 28 : క్రిస్ గేల్.. ఈ పేరు క్రికెట్ అభిమానులకు పరిచయం చేయక్కరలేదు. క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అలాంటి గేల్ కు నిన్న జరిగిన ఐపీఎల్-11 వేలంలో చేదు అనుభవం ఎదురైనా విషయం తెలిసిందే. అయితే రెండో రోజు వేలంలో ఈ కరేబియన్ స్టార్ ఆటగాడిని పంజాబ్ జట్టు దక్కించుకొంది. ఈ రోజు అన్‌సోల్డ్ ఆటగాళ్ల కోసం మరోసారి జరిగిన వేలంలో ప్రీతిజింతా నేతృత్వంలోని పంజాబ్ జట్టు రూ.2 కోట్లకు తమ వశం చేసుకుంది.